2
అక్షరటుడే, మాక్లూర్: CPR | ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ సీపీఆర్‌పై అవగాహన ఉండాలని వైద్యుడు అరవింద్ (Dr. Aravind) పేర్కొన్నారు. సీపీఆర్‌పై అవగాహన (CPR Awareness) వారోత్సవాల్లో భాగంగా మాక్లూర్ కేజీబీవీలో (KGBV) ఆర్బీఎస్కే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వైద్యుడు అరవింద్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు సంభవిస్తోందన్నారు. ఆహార అలవాట్లు, శరీరానికి వ్యాయామం లేకపోవడం కారణంగా హార్ట్ ఎటాక్ (heart attacks) వచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేస్తే బాధితుడిని కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే సిబ్బంది వినయ, రాకేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] ప్రాక్టికల్‌గా సీపీఆర్ (CPR) ఏవిధంగా చేయాలో చేసి చూపించారు. […]
Comments are closed.