అక్షరటుడే, ఆర్మూర్: Forest Department | పర్యావరణ సమతుల్యత కోసం అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ అత్యంత కీలకమని ఆర్మూర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ (Deputy Range Officer Sudhakar) అన్నారు. ఈ మేరకు సోమవారం నందిపేట మండలంలోని ఐలాపూర్లో (Ailapur village) విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ చట్టం–1972 (Wildlife Protection Act –1972) ప్రకారం అటవీ జంతువులను వేటాడడం నేరమన్నారు. వన్యప్రాణాలను వేటాడితే చట్టప్రకారం విధించే కఠిన శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Forest Department | ప్రకృతిలో పాముల పాత్ర..
అనంతరం స్నేక్ క్యాచర్లు షేక్మున్నా, అంజద్లు మాట్లాడుతూ పాముల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విషపూరిత, విషరహిత పాముల మధ్య తేడాలను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, పాఠశాల హెచ్ఎం ఐలయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, సాయాగౌడ్, శ్రీకాంత్, సీఆర్పీ రాజు తదితరులు పాల్గొన్నారు.