అక్షరటుడే, బోధన్ : ACP Srinivas | ప్రతిఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలపై (Traffic Rules) అవగాహన కలిగి ఉండాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో (‘Alive Arrive’ Program) భాగంగా పట్టణంలోని ఇందూర్ ప్రైమరీ స్కూల్లో (Indur Primary School) విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ACP Srinivas | రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను (Road Accidents) తగ్గించాలనే ఉద్దేశంతో డీజీపీ ఆదేశాల మేరక ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్‌ను బరువుగా ఫీల్ కాకుండా వినియోగించడం వల్ల ప్రమాదాలు జరిగినట్లయితే ప్రాణాలను కాపాడుతుందన్నారు. అలాగే విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలని.. వారి ఇంటికి వెళ్లాక వారి తల్లిదండ్రులకు సైతం వివరించాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ, పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.