76
అక్షరటుడే, ఇందూరు: Traffic rules | ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను (traffic rules) పాటిస్తూ వాహనాలను నడపాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా వినియోగదారుల సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు (National Road Safety Week) నిర్వహించారు.
Traffic rules | మైనర్లు వాహనాలు నడపొద్దు..
ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ.. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదన్నారు. నడిపితే వాహన యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎంవీఐ మణికాంత్, సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, లింగయ్య పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.