అక్షరటుడే, కామారెడ్డి : National Unity Day | దేశ సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా (Kamareddy District) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ రాజేష్ చంద్ర పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన 2కే రన్ జీవధాన్ స్కూల్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు కొనసాగింది.
అక్కడ సర్దార్ పటేల్ విగ్రహానికి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏక తాటిపైకి తెచ్చి ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడన్నారు. ఆయన స్ఫూర్తితో అందరూ సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలన్నారు.
ప్రతిపౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. 2కే రన్ కార్యక్రమం ద్వారా యువతలో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంలో పోలీస్ శాఖ (Police Department) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ నరసింహారెడ్ది, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

