అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) ప్రతి ఓటు కీలకమేనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో నాలుగు అసెంబ్లీల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అయ్యే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు.
ఒకవేళ రిజర్వేషన్ కారణంగా పోటీచేసే అవకాశం లేని వారు.. గెలిపించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు పనిచేయాలని చెప్పారు.