Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

Nizamabad Collector | ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నవీపేట్​ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల, భవిత కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Nizamabad Collector | ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్​లో నమోదు చేయాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. నవీపేట మండల కేంద్రంలోని (Navipeta Mandal Center) దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు.

యూడైస్​లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికెట్ (birth certificates) లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్ఎం హన్మంతరావు తెలుపగా.. కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అవసరమైన వారి ఆధార్ వివరాలను (Aadhaar details) కూడా అప్డేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.

జనన ధ్రువీకరణ పత్రం కోసం బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే విద్యార్థులకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహశీల్దార్ వెంకటరమణకు సూచించారు. కాగా.. ప్రతి విద్యార్థికి సంబంధించి అపార్ జెనరేట్ జరగాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల (teachers and students) హాజరు ముఖ గుర్తింపు విధానం ద్వారానే వంద శాతం చేయాలని సూచించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకుంటూ వందశాతం ఎఫ్ఆర్ఎస్ అమలయ్యేలా చూడాలన్నారు.

కిచెన్ గార్డెన్ నిర్వహణను మెరుగుపర్చాలని, పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న పాత గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా.. పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టాల్సిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను (engineering department officials) ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంతమేరకు అదనపు నిధులను సమకూరుస్తామని కలెక్టర్​ తెలిపారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతులు, నిర్మాణాల ప్రతిపాదనలు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో సమీక్షకు హాజరు కావాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో అశోక్, ఎంపీడీవో నాగనాథ్, తహశీల్దార్ వెంకట రమణ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్, భవిత కేంద్రాల జిల్లా ఇంఛార్జి ప్రకాశ్​ తదితరులున్నారు.

Must Read
Related News