HomeUncategorizedCeasefire | ప్రతి ఘటన తీవ్రంగా ఉండాలి.. ఆర్మీ చీఫ్ కీలక ఆదేశాలు

Ceasefire | ప్రతి ఘటన తీవ్రంగా ఉండాలి.. ఆర్మీ చీఫ్ కీలక ఆదేశాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ceasefire | పాకిస్తాన్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉండాలని ఆర్మీ చీఫ్​ ఉపేంద్ర ద్వివేది బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇది వరకు మోదీ సైతం పాక్​ బుల్లెట్లు కాలిస్తే క్షిపణులతో దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కమాండర్లకు పూర్తి అధికారులు ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి దాడులు జరిగితే దాడులు తీవ్రంగా ఉండాలని పశ్చిమ ప్రాంతంలోని అన్ని ఆర్మీ కమాండర్లకు ఆర్మీ చీఫ్ పూర్తి అధికారాలు కట్టబెట్టారు.

Ceasefire | పాక్​ ఎయిర్​బేస్​లు ధ్వంసం

ఆపరేషన్​ సిందూర్​ అనంతరం పాక్​ నిత్యం భారత్​పై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎల్​వోసీ వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో భారత్​పై దాడికి యత్నించింది. అయితే పాక్​ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. దాయది దేశం ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చి వేసింది. పాక్​ దాడులకు ప్రతీకారంగా భారత్​ యుద్ధ విమానాలు, క్షిపణులతో పాకిస్తాన్​లోని ఎయిర్​బేస్​లు, మిలటరి స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో శనివారం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

Ceasefire | ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​

కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాక్​ తన వక్రబుద్ధి బయటపెట్టింది. శనివారం రాత్రి డ్రోన్లతో మళ్లీ భారత్​పై దాడికి యత్నించింది. ఈ దాడులను భారత్​ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్​ బలగాలకు కీలక అధికారులు ఇచ్చారు. పాక్​ మళ్లీ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడితే తీవ్రస్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం మధ్యాహ్నం ఇరుదేశాల ఆర్మీ జనరల్స్​ సమావేశం జరగనుంది.