అక్షరటుడే, భీమ్‌గల్ : MLA Prashanth Reddy | కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల శ్రీనివాస్ (Meesala Srinivas) మంగళవారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారిని తన స్వగృహంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
MLA Prashanth Reddy | దుర్మార్గపు పాలన..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) దుర్మార్గపు పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో విసిగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) వైపు చూస్తున్నారన్నారు. శ్రీనివాస్‌తో పాటు దుంపల శ్రీను, గంగాధర్, ప్రవీణ్ మరికొందరు కార్యకర్తలు కాంగ్రెస్ వీడి గులాబీ గూటికి చేరారు. గున్నాల భగత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపల్లి సురేష్, మందుల చంటి తదితరులు పాల్గొన్నారు.