అక్షరటుడే, తిరుమల: SSD tokens | తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ anil Kumar తెలిపారు.
తిరుమల Tirumala అన్నమయ్య Annamayya భవనంలో నిర్వహించిన ‘డయల్ యువర్ ఈవో’ ‘Dial Your EO’ కార్యక్రమంలో భక్తులతో ముచ్చటించిన ఆయన.. తిరుమల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, “రెండోసారి శ్రీవారి సన్నిధిలో టీటీడీ ఈవో (TTD EO) గా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (Chief Minister Nara Chandrababu Naidu) కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గరుడసేవ రోజున ఎండ, వర్షం మధ్య భక్తులు చూపిన శ్రద్ధ, సేవా సిబ్బంది అందించిన సేవలు అభినందనీయం. భక్తుల విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధుల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటు చేసే దిశగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం..” అని వివరించారు.
SSD tokens | ఉచిత దర్శనం టోకెన్లపై స్పష్టత
అలిపిరి Alipiri, శ్రీవారి మెట్టు Srivari Mettu మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శన టోకెన్లు మంజూరు చేయాలని వచ్చిన విజ్ఞప్తిపై స్పందించిన ఈవో.. “ప్రతి రోజు 16 వేల నుంచి 24 వేల వరకు ఉచితంగా SSD (సర్వదర్శనం) టోకెన్లు జారీ చేస్తున్నాం. ఇవి తిరుపతిలోని శ్రీనివాసం (RTC బస్టాండ్), విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురుగా), భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి) లో అందుబాటులో ఉంటాయి..” అని తెలిపారు.
శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వచ్చే భక్తులు, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పొందిన తర్వాత, 1200వ మెట్టు వద్ద వాటిని తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు.
బ్రహ్మోత్సవాల సమయంలో కొంతమంది దళారులు టీటీడీ ఉద్యోగుల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి దర్శనం కల్పించకుండా మోసం చేస్తున్నారని ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న ఈవో, “భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దళారులు, సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం..” అని హెచ్చరించారు.
ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో అన్నప్రసాదాల నాణ్యత, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు.
గరుడసేవ Garuda Seva రోజున భక్తులకు 3,500 మంది శ్రీవారి సేవకులు అత్యుత్తమ సేవలు అందించారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.