అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | దేశాభివృద్ధిలో ప్రతిపౌరుడు ప్రధాన భూమిక పోషించాలని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి (TU Registrar Yadagiri) పేర్కొన్నారు.
వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) విద్యార్థులతో కలిసి గీతాలాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు ఈ గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ కె లావణ్య, ప్రొఫెసర్ ఎల్లోసా, డాక్టర్ స్వప్న డాక్టర్ కిరణ్మయి తదితర టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
