అక్షరటుడే, ఆర్మూర్ : Organ Donation | అకాల మరణం చెందిన తన కుమారుడిని చూసి ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే అతడు మరణించినప్పటికీ అవయవాలు మరో నలుగురికి ఉపయోగపడాలని అనుకున్నారు. దీంతో అవయవదానానికి ముందుకొచ్చారు.
Organ Donation | బాద్గుణ గ్రామానికి చెందిన యువకుడు..
నందిపేట్ మండలం (Nandipet Mandal) బాద్గుణ గ్రామానికి చెందిన బుర్రకుంట సునీత్ అనే యువకుడు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని (Hyderabad) గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి అకాల మరణంతో తీవ్రంగా విషాదంలో మునిగినప్పటికీ, తల్లిదండ్రులు పోశెట్టి, పోసాని మానవత్వాన్ని చాటుకున్నారు.
Organ Donation | స్వచ్ఛందంగా అవయవదానం..
తమ కుమారుడు సునీత్ అవయవాలను దానం చేసేందుకు ఆయన తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో వారు మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపినవాళ్లయ్యారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) వైద్యులు తల్లిదండ్రులకు అవయవదాన సర్టిఫికెట్ను అందజేశారు.