అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చిరుసాయం చేసినప్పటికీ బాలిక అందరి మనసు గెలిచింది.. ఈ ఘటన వర్ని మండలం (Varni mandal) బడాపహాడ్ వద్ద చోటు చేసుకుంది. బడా పహాడ్ దర్గా (Badapahad Dargah) వద్ద 115ఏళ్ల వృద్ధురాలు నా అనేవారు లేక భిక్షాటన చేస్తోంది.. అక్కడ ఓ చిన్న గుడిసెలో ఒంటరిగా నివాసముంటోంది.
అయితే పడాపహాడ్కు వచ్చిన బీడీఎస్ విద్యార్థిని (BDS student) ఎన్.ఇషాశ్రీ వృద్ధురాలి ధైన్యాన్ని చూసి చలించిపోయింది. తన దగ్గర ఉన్న రూ.200 నోటు తీసి ఆ వృద్ధురాలు ఇచ్చింది. ఆప్యాయంగా ఆమె యోగాక్షేమాలను తెలుసుకుంది.
Banswada | కొంగులో దాచుకుని.. కన్నీళ్లు పెట్టుకుని..
దీంతో ఆ వృద్ధురాలి సంతోషంతో నోటును కొంగులో దాచుకుంది. తెలియకుండానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ బాలిక చేసిన సాయం చిన్నదేనైనా ఈ దృశ్యాన్ని చూసిన వారి మనసు గెలుసుకుంది. మాటలకన్నా మానవత్వమే మిన్న అని అక్కడివారు చర్చించుకున్నారు. ఈ ఘటన నేటి సమాజంలో చిన్న సాయం కూడా ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో స్పష్టంగా చూపిస్తోంది. ఒంటరిగా మిగిలిన వృద్ధుల పట్ల సమాజం మరింత స్పందించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.