అక్షరటుడే, న్యూఢిల్లీ: EV vehicles | భారత్‌లో రాబోయే 4 – 6 నెలల్లో పెట్రోల్ వాహనాల ధరతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ | (Union Minister for Road Transport and Highways Nitin Gadkari) పేర్కొన్నారు.
క్లీన్ మొబిలిటీ వైపు భారత్ చేస్తున్న ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయిగా వెల్లడించారు. దిల్లీలో సోమవారం (అక్టోబరు 6) 20వ FICCI హైయర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025 (FICCI Higher Education Summit 2025) నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
మన దేశం తాజాగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఎదిగిందని కేంద్రమంత్రి ఇటీవలే పేర్కొన్నారు.
EV vehicles | మూడో అతిపెద్ద దేశం
రాబోయే ఐదేళ్లలో నంబర్ వన్ స్థానాన్ని అందుకుంటుందని తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీ (automobile industry) లో యూఎస్ (US) అగ్రగామిగా ఉంది. దీని విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంది.
చైనా (CHINA) దాదాపు రూ.47 లక్షల కోట్ల విలువతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ (JAPAN) ను భారత్ (BHARATH) అధిగమించింది. రూ.22 లక్షల కోట్ల విలువతో మూడో స్థానంలో ఉంది.
ఈ క్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఆర్థిక, పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించారు.
ఇథనాల్ ఉత్పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత గట్టిగా బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొక్కజొన్న ద్వారా ఇథనాల్ ప్రొడక్ట్ చేస్తూ రైతులు అదనంగా రూ. 45,000 కోట్లు సంపాదించినట్లు మంత్రి తెలిపారు.
1 comment
[…] ఈ వాహనం (vehicle) పై వేయబడ్డ చలాన్ల జరిమానా మొత్తం […]
Comments are closed.