Homeబిజినెస్​European markets | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

European markets | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: European markets | గత సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు(US markets) నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీలో ఏడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది.

యూరోప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది.

European markets | యూఎస్‌ మార్కెట్లు..

ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌(Nasdaq) 0.67 శాతం, ఎస్‌అండ్‌పీ 0.38 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.11 శాతం లాభంతో ఉంది.

European markets | యూరోప్‌ మార్కెట్లు..

ఎఫ్‌టీఎస్‌ఈ 0.05 శాతం, సీఏసీ(CAC) 0.04 శాతం, డీఏఎక్స్‌ 0.03 శాతం లాభాలతో ముగిశాయి.

European markets | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 7.55 గంటల సమయంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.66 శాతం లాభంతో కొనసాగుతుండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.97 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.68 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.40 శాతం నష్టంతో ఉన్నాయి.

గిఫ్ట్‌ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

చైనా నేషనల్‌ డే సందర్భంగా ఈరోజు కూడా షాంఘై ఎక్స్ఛేంజ్‌కు సెలవు. సౌత్‌కొరియాలో హార్వెస్ట్‌ మూన్‌ ఫెస్టివల్‌ సందర్భంగా కోస్పీ(Kospi) తెరచుకోలేదు.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు పది సెషన్‌ల తర్వాత నికర కొనుగోలు దారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ.1,440 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు వరుసగా 30వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 452 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.33 నుంచి 1.03 కు తగ్గింది. విక్స్‌(VIX) 1.4 శాతం తగ్గి 10.05 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 65.61 డాలర్ల వద్ద ఉంది.
  • డాలరుతో రూపాయి మారకం విలువ 88.78 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.16 శాతం వద్ద, డాలరు ఇండెక్స్‌ 98.17 వద్ద కొనసాగుతున్నాయి.
  • భారత్‌, యూఎస్‌ మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, నవంబర్‌లో వాణిజ్య ఒప్పందం(Trade deal) కుదిరే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. ఇది భారత మార్కెట్లకు సానుకూలాంశం.