అక్షరటుడే, వెబ్డెస్క్ : Eatala Rajendar comments | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే ఐదేళ్లు అంధకారమే అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఆదివారం పరకాల, జనగామ (Jangaon) మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ (BRS) గతం, కాంగ్రెస్ ఖతం, బీజేపీకి గెలుపు రథం అని ఈటల అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. ధర్మమే నెగ్గుతుందన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అక్కడ లేదు, ఇక్కడ లేదని చెప్పారు. వారికి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టే శక్తి లేదని, గెలిపిస్తే ఐదేళ్లు అంధకారమే అన్నారు.
Eatala Rajendar comments | పేద రాష్ట్రం కాదు
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు వింటే గుండెలు మండుతున్నాయని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రినని గుర్తు చేశారు. తెలంగాణ పేద రాష్ట్రం కాదని, అడుక్కునే రాష్ట్రం అంతకంటే కాదన్నారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పారు. అలాంటి తెలంగాణను పట్టుకొని, అప్పు పుట్టడం లేదని సీఎం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Eatala Rajendar comments | హామీల అమలు ఎక్కడ
‘‘హామీలు ఇచ్చేటప్పుడు అడిగితే.. మాకు తెలివి ఉంది. హైదరాబాద్లో ముక్క అమ్మితే మస్తు డబ్బులు వస్తాయి” అని కాంగ్రెస్ నాయకులు అన్నారని ఎద్దేవా చేశారు. మరి ఈ రోజుల హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ రూ.4 వేలు ఎక్కడ అని ప్రశ్నించారు. రైతు బంధు రూ.15 వేలు చేస్తామని చెప్పి రూ.12 వేలు చేశారన్నారు. అది కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
Eatala Rajendar comments | కాంగ్రెస్ పాలన స్కాములమయం
కాంగ్రెస్ పాలన స్కాములమయం అని ఈటల రాజేందర్ అన్నారు. హెలికాప్టర్లు కొనుగోళ్లలో స్కాం, బొగ్గు స్కాం, 2G స్కాం యూపీఏ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. కానీ మోదీ (PM Modi) 12 ఏళ్ల పాలనలో ఒక్కనాడు అన్న ప్రజలు తలదించుకునే పని చేశారా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మళ్లీ తాము అధికారంలోకి వచ్చేది లేదని అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపించారు.