143
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాలలో (Adavilingala village) ఆదివారం ఓట్ల లెక్కింపులో విచిత్రం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులుగా మంగలి మంగలి సంతోష్ కుమార్, పెంట మానయ్యా పోటీలో నిలబడ్డారు.
ఇద్దరికీ సమానంగా 483 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు వారిద్దరి సమక్షంలో టాస్ వేశారు. టాస్‌లో మంగలి సంతోష్ కుమార్ విజయం సాధించినట్లు ప్రకటించారు. హోరాహోరీగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చివరికి టాస్పరంగా సంతోష్ విజయం సాధించడం గమనార్హం.