అక్షరటుడే, వెబ్‌డెస్క్: EPFO | ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కూడా రిటైర్ retirement అయ్యే వరకు ఎంతో కొంత మొత్తం సేవింగ్ చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ Employees’ Provident Fund చట్టం 1952 తో ఈపీఎఫ్ ప్లాన్ ను EPF plan ప్రవేశపెట్టగా, దీనిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిర్వహిస్తుంది. దీని ప్రకారం ప్రతి నెలా జీతంలో నుంచి salary కొంత జమ అవుతుంటుంది. అయితే, తమ ఖాతాలో ఎంత సొమ్ము ఉందని చాలా మంది తెలుసుకోవాలనుకున్నా.. సరైన ప్రక్రియ correct process తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనికి ఒక పాస్ వర్డ్ ఉంటుంది. మీరు ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్ EPFO password మర్చిపోతే ఇలా సింపుల్‌గా రీసెట్ చేసుకోవచ్చు.
EPFO | ఇలా చేసుకోండి..
మీ పీఎఫ్ యూఏఎన్ నంబర్‌ను PF UAN number మర్చిపోతే.. మళ్ళీ జనరేట్ generate చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పీఎఫ్ UAN జారీ చేస్తుందన్న విషయం మనందరికి తెలిసిందే. అది 12-అంకెల గుర్తింపు సంఖ్య కాగా, కంపెనీ ఉద్యోగి company employee ఈ 12-అంకెల గుర్తింపు నంబర్‌పై identification number PF కోసం డబ్బును జమ చేస్తారు. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా గుర్తింపు సంఖ్య అనేది మారదు. ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్‌ను EPFO password ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
కొత్త UAN లాగిన్ పాస్‌వర్డ్ login password కనీసం 20 క్యారెక్టర్స్ లాంగ్ ఉండవచ్చు. ఇందులో కనీసం 4 లెటర్స్, రెండు అంకెలు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇందులో కనీసం ఒక క్యాపిటల్ లెటర్, ఒక చిన్న క్యారెక్టర్ ఉండాలి.
పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలి అంటే ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.. హోమ్‌పేజీలో ‘Forgot Password’ లింక్‌పై క్లిక్ చేయండి.. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత ‘Verify’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపుతారు. OTPని ఎంటర్ చేసి ‘Verify’పై క్లిక్ చేయండి.. కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేసి ‘Submit’పై క్లిక్ చేయండి. మీ పాస్‌వర్డ్ రీసెట్ అయ్యాక ఇప్పుడు మీ కొత్త పాస్‌వర్డ్‌ని ఉపయోగించి EPF పాస్‌బుక్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ సభ్యులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ చేస్తోంది.