అక్షరటుడే, ఇందూరు : Heroine Aishwarya Rajesh | “హలో నిజామాబాద్ పీపుల్.. ఎలా ఉన్నారు”.. అంటూ సంక్రాంతి సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందూరులో సందడి చేశారు.
హైదరాబాద్ రోడ్లోని గోయస్ సిల్వర్ జువెలరీ(Goyas Silver Jewellery) షోరూం ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో కలిసి హాజరయ్యారు. అభిమానుల కోరిక మేరకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. దేశంలోనే లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ షో రూమ్ గోయాజ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాన నగరాలతో నిజామాబాద్(Nizamabad) పోటీ పడుతోందని నటి ఐశ్వర్య పేర్కొన్నారు.