అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రిన్సిపాల్ కైతర్ పాషా సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని (Kotagiri Mandal Center) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రెషర్స్ డే వేడుకలు (Freshers’ Day celebrations) నిర్వహించారు. ఈ మేరకు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లోని (government colleges) వసతులు, సౌకర్యాలు వినియోగించుకోవాలని విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సమయపాలన పాటిస్తూ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో అధ్యాపకులు, దత్తు, ప్రమోద్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.