అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | జిల్లాలో యాసంగి సీజన్‌కు ఎరువుల కొరత రాకుండా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. బోధన్ మండలం (Bodhan mandal) మావందికుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఎరువుల గోడౌన్‌ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Collector Nizamabad | ఎరువుల స్టాక్ పరిశీలన..
గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువుల స్టాక్‌ను కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ బోర్డుపై ప్రదర్శించిన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా లేదా అని ఆరాతీశారు. యాసంగి సీజన్లో ఎంత మొత్తంలో యూరియా అవసరం పడుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
Collector Nizamabad | ప్రైవేట్ డీలర్లు నిబంధనలు పాటించాలి
ప్రైవేట్ డీలర్లు కూడా నిబంధనలను పాటిస్తూ, ఎరువుల విక్రయాలు జరిపేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా ఎరువుల పంపిణీ జరగాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.