అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | ఆర్టీసీ అద్దె బస్సుల్లో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న (Regional Manager Jyotsna) తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
RTC Nizamabad | నిబంధన ప్రకారం నడుచుకోవాలి..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అద్దెబస్సులు ఆర్టీసీ నిబంధనల (RTC rules) ప్రకారం సమయపాలనతో పాటు నిర్వహణలోపం లేకుండా ఉండాలన్నారు. బస్సుల కండిషన్, డ్రైవర్ ప్రవర్తన, ట్రాఫిక్ నిబంధనల (traffic rules) పాటింపు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సేవల నాణ్యత ప్రయాణికుల భద్రత, షెడ్యూల్ నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
RTC Nizamabad | సమావేశాలతో సంస్థ బలోపేతం..
ఇలాంటి సమావేశాల ద్వారా సంస్థకు, అద్దె బస్సుల యజమానులకు మధ్య సమన్వయం మరింత బలపడుతుందని ఆర్ఎం పేర్కొన్నారు. అనంతరం అద్దె బస్సుల యజమానులు తమ సమస్యలను ఆర్ఎం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పీవో పద్మజ, ఏవో పరమాత్మ తదితరులు పాల్గొన్నారు.