అక్షరటుడే, ఎల్లారెడ్డి :Yellareddy | ఎల్లారెడ్డి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. ఆలయంలోకి చొరబడి దొంగతనం చేశారు. ఈ ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్(Yellareddy Police Station) పరిధిలోని హాజీపూర్ తండాలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయం(Jagadamba Mata Temple)లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డారు. హుండీ(Hundi)ని ఎత్తుకెళ్లి దానిని ధ్వంసం చేశారు. అందులోని రూ.30 వేల నగదు చోరీ చేశారు. ఆదివారం ఉదయం పూజారి దుప్య నాయక్ గమనించి తండావాసులకు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.