HomeUncategorizedKapil Sharma | రెచ్చిపోయిన ఖలిస్థానీ ఉగ్రవాదులు.. కమెడియన్‌ కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు

Kapil Sharma | రెచ్చిపోయిన ఖలిస్థానీ ఉగ్రవాదులు.. కమెడియన్‌ కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kapil Sharma | కెనడా (Canada)లో మరోసారి ఖలిస్థానీ తీవ్రవాదులు రెచ్చిపోయారు. కొంతకాలంగా కెనడా కేంద్రంగా ఖలిస్థానీ మద్దతుదారులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. గతంలో మోదీ పర్యటన సందర్భంగా వీరు నిరసన కూడా చేపట్టారు. అయితే తాజాగా ప్రముఖ కమెడియన్​ కపిల్​ శర్మ (Kapil Sharma) కేఫ్​పై వీరు కాల్పులు జరిపారు.

కపిల్ శర్మ కేఫ్ ఇటీవల కెనడాలో కేఫ్​ ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన కొద్ది రోజులకే కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. గురువారం ఆయన కేఫ్​పై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఖలిస్తానీ(Khalistani) ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ ఘటనకు బాధ్యత వహించాడు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.

లడ్డీ NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడు. కపిల్​ శర్మ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతీకారంతో కాల్పులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించాయి. కాగా లడ్డీ గతంలో పంజాబ్​లో వీహెచ్​పీ (VHP) నాయకుడు వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా హత్య కేసులో నిందితుడు. ఆ ఉగ్రవాదిని అప్పగించాలని ఎన్​ఐఏ కొంతకాలంగా కెనడా ప్రభుత్వాన్ని కోరుతోంది.

కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడా కేంద్రంగా భారత్​లో విధ్వంసాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కెనడ గత ప్రధాని ట్రూడో ఖలిస్థానీలకు మద్దతుగా ఉన్నారు. అంతేగాకుండా ఖలిస్థానీ ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపితే భారత్​ చేసినట్లు ఆరోపించారు. అనంతరం భారత్​, కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే కెనడా కొత్త ప్రధానిగా మార్క్​ కార్నే (Mark Carney) వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడుతున్నాయి. ఇటీవల కెనడా వేదికగా జరిగిన జీ 7 సదస్సుకు కార్నే ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.