ENGvsIND
ENG vs IND | ప్రారంభమైన మూడో టెస్టు.. రాణిస్తున్న భార‌త బౌల‌ర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ENG vs IND | భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో (Test series) భాగంగా కొద్ది సేప‌టి క్రితం మూడో టెస్ట్ ప్రారంభ‌మైంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో (Lords Cricket Ground) ఈ పోరు మొద‌లైంది.

ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది, అందుకే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యం పొందాల‌ని భావిస్తున్నాయి. మొదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్ (England) గెలిస్తే, రెండో టెస్ట్‌లో భారత్ (India) అద్భుతంగా పుంజుకుంది. లార్డ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 1986, 2014, 2021లో మూడు విజయాలు సాధించింది. ఇంగ్లాండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే, లార్డ్స్‌లో భారత్‌కు ఎక్కువ విజయాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఆకాష్ దీప్ మెరుగైన ప్రదర్శన ఇవ్వ‌డంతో మంచి విజ‌యాన్ని సాధించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ (captain Shubman Gill) కూడా ముఖ్య పాత్ర పోషించింది.

ENG vs IND | ఓపెన‌ర్స్ జోరు..

అయితే మూడో టెస్ట్ కోసం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జ‌ట్టులో చేర‌డంతో బౌలింగ్ విభాగం ప‌టిష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (England captain Ben Stokes) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా, బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. “ఇక్కడ పిచ్ మొదట్లో బౌలర్లకు కొంత సాయం చేస్తుంది. మా జట్టు రెడీగా ఉంది, ప్రతి క్రికెటర్ లార్డ్స్‌లో ఆడడానికి ఎంతో ఇష్టపడతారు. మా జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది, ఆర్చర్ తిరిగి వచ్చాడు అని పేర్కొన్నాడు. ఇక గిల్ మాట్లాడుతూ.. ఈ ఉదయం వరకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే మొదటి సెషన్‌లో బౌలర్లకు కొంత సహాయం ఉంటుంది అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. బౌలర్లు కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మా జట్టులో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా ఎంట్రీ ఇచ్చారు అని వెల్లడించాడు.

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు (Kuldeep Yadav) మళ్లీ నిరాశే ఎదురైంది అని చెప్పాలి. మూడో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కుతుంది అని అనుకోగా, కేవ‌లం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కోసం తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన ప్రసిధ్ కృష్ణని త‌ప్పించారు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ జ‌ట్టు దూకుడుగా ఆడుతుంది. ఓపెన‌ర్లు ఇద్ద‌రు ధీటుగా రాణించే ప్ర‌య‌త్నం చేశారు. జాక్ క్రాలీ (18) , బెన్ డకెట్ (23) ఇద్ద‌రిని కూడా నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవ‌ర్‌లో ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ రెండు వికెట్స్ కోల్పోయి 43 ప‌రుగులు చేసింది.