అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India : ఇంగ్లండ్(England) పర్యటనలో భారత బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరచడంతో టీమిండియా India ఓటమితో ఈ టూర్ ప్రారంభించింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ(nderson-Sachin Trophy)లో టీమిండియా శుభారంభం చేయలేక చతికిలపడింది. భారత ఆటగాళ్లు చేసిన ఐదు సెంచరీలు కూడా వృథా అయ్యాయి. లీడ్స్ Leeds వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్‌తో ఐదు వికెట్లతో తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. 21/0 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్ Ben Duckett(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్‌తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ Jack Crawley(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్ Joe Root(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది ఇంగ్లండ్.
Team India : చేజేతులా..
అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొత్తం 9 క్యాచ్‌లను జారవిడిచింది. జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లను, రెండో ఇన్నింగ్స్‌లో 3 క్యాచ్‌లను జారవిడుచుకుంది. ఈ ఓటమితో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్Kl Rahulతో పాటు రిషభ్ పంత్ సాధించిన రెండు శతకాలు వృథా అయ్యాయి. ఈ మ్యాచ్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఎడిషన్ ప్రారంభమవ్వగా.. టీమిండియా ఓటమితో మొదలెట్టింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ దుమ్మురేపారు. ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌లను పంత్, బుమ్రా వదిలేశారు. ఈ అవకాశాలతో చెలరేగిన డకెట్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేశాడు. దాంతో అతను జడేజా వేసిన మరుసటి ఓవర్‌లో బౌండరీ బాది 121 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత జాక్ క్రాలీని ప్రసిద్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అదే స్పెల్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఓలీ పోప్(8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అయితే, జెమీ స్మిత్(44 నౌటౌట్), జో రూట్ Root అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ జులై 2 నుంచి బర్మింగ్‌హామ్(Birmingham)లో జరగనుంది.
