అక్షరటుడే, ఇందూరు: Engineers’ Day | నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ (Lions Club of Indur) ఆధ్వర్యంలో ఇంజినీర్స్డేను నిర్వహించారు. లయన్స్ కార్యాలయంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ఇంజినీర్లను సన్మానించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ వెంకటేష్, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Bodhan Government Junior College) ఒకేషనల్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇంజినీర్ కైరంకొండ ప్రకాష్‌లను సన్మానించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి.రాఘవేందర్ మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (Mokshagundam Visvesvaraya) జన్మదినాన్ని ఇంజినీర్స్డేగా జరుపుకుంటున్నామన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత గొప్ప ఇంజినీర్లుగా తయారై దేశాన్ని నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఛైర్మన్ చెన్న రవీందర్ తదితరులు పాల్గొన్నారు.