అక్షరటుడే, వెబ్డెస్క్ : Guntur | గుంటూరు నగరంలో ఓ యువతి దారుణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ ద్వారా టేపు, క్లిప్పులు ఆర్డర్ చేసి, వాటితోనే ప్రాణాలు తీసుకోవడం ప్రజలను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
పట్టాభిపురం పోలీసులు (Pattabhipuram police) తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన శ్రావ్య (వయసు 20), గుంటూరు నంబూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో (private engineering college) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె నగరంలోని అశోక్ నగర్‌లో ఉన్న ఓ మహిళల హాస్టల్‌లో నివసిస్తూ చదువులు కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో, విజయవాడలో (Vijayawada) ఉన్న తన స్నేహితురాలు జాగృతికి ఫోన్ చేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది.
Guntur | ఆత్మహత్యకు కారణం?
విషయం తెలిసి షాక్‌కు గురైన జాగృతి వెంటనే శ్రావ్య కుటుంబానికి సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు వెంటనే శ్రావ్యతో ఫోన్‌లో మాట్లాడగా, “అలా అన్నానంతే, చేసుకునే ఉద్దేశం లేదు” అంటూ నమ్మబలికించినట్టు తెలుస్తుంది. కానీ వారు శ్రావ్య మాటలు నమ్మలేక, హాస్టల్‌లో ఉన్న ఇతర విద్యార్థినులకు కాల్ చేసి ఆమెను చూసుకోమని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో శ్రావ్య తన గది వెలుపల వరండాలో కూర్చుని ఉందని తెలుస్తోంది.
అయితే, అదే రాత్రి 12:30 గంటల సమయంలో శ్రావ్య ఇన్‌స్టా మార్ట్ (Insta Mart) ద్వారా టేపు, క్లిప్పులు ఆర్డర్ చేసింది. కొద్దిసేపటికే డెలివరీ బాయ్ వాటిని అందజేశాడు. అనంతరం, సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో, తోటి విద్యార్థినులు గమనించినపుడు శ్రావ్య (Sravya) వరండాలో నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్పు పెట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
వెంటనే హాస్టల్ (Hostel) సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. శ్రావ్యను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.శ్రావ్య ఈ మేరకు ఎందుకు నిర్ణయం తీసుకుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ లాగ్స్, గదిలో లభించిన ఆధారాల ఆధారంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.