అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | పీడీఎస్‌యూ పోరాట ఫలితంగానే తెయూలో ప్రభుత్వం ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టిందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, సహాయ కార్యదర్శి ప్రిన్స్ అన్నారు. ఈ మేరకు శనివారం వర్సిటీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) ఇంజినీరింగ్ కోర్సులు (engineering courses) ప్రవేశ పెట్టాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అనేకసార్లు ఆందోళనలు చేపట్టిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నపాలు చేయడంతోపాటు ధర్నాలు చేపట్టిందన్నారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్న సందర్భంగా బాలికలకు సరిపడా వసతిగృహం నిర్మించాలని, పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించాలని, డిమాండ్ ఉన్న ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టడానికి వర్సిటీ అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెయూ నాయకులు రాకేష్, గౌతం రాజ్, రాజేందర్, రాము, తదితదిరులు పాల్గొన్నారు.