Engineering College
Engineering College | ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే ఇంజినీరింగ్ కళాశాల

అక్షరటుడే, కామారెడ్డి: Engineering College | ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగానే ఇంజినీరింగ్ కళాశాల (Engineering College) మంజూరైందని డాక్టరేట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గురువారం భిక్కనూరు సౌత్ క్యాంపస్​లో డాక్టరేట్స్ అసోసియేషన్ (Doctorates Association) ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు ఎన్నో ఏళ్ల పోరాటమన్నారు.

ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ కళాశాల కోసం వైస్ ఛాన్స్​లర్​గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యాదగిరి రావు తీవ్ర కృషి చేశారన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సరిత, రాహుల్, సత్యం, రమేశ్​, అధ్యాపకులు ప్రొఫెసర్ అంజయ్య, మోహన్ బాబు, యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.