ePaper
More
    HomeతెలంగాణPashamylaram Incident | తీరని వేదన.. తమ వారి కోసం సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల...

    Pashamylaram Incident | తీరని వేదన.. తమ వారి కోసం సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల నిరీక్షణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram Incident | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో (Sigachi factory) పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పొట్ట చేతపట్టుకొని పనిచేయడానికి వచ్చిన కార్మికులను బతుకులను బుగ్గిపాలు చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 40 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు సహాయక చర్యలు (rescue operations) చేపడుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ వద్ద దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తమ వారి కోసం పలువురు పరిశ్రమ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు.

    Pashamylaram Incident | పోలీసులు కాళ్లు పట్టుకున్న ఓ తండ్రి

    చేతికొచ్చిన కొడుకు పరిశ్రమలోని పనికి వెళ్లి తిరిగి రాలేదు. ఆ తండ్రి తమ కుమారుడి ఆచూకీ తెలపాలని పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. సిగాచి ఫ్యాక్టరీలో (Sigachi factory) జస్టిన్ (22) ఉద్యోగంలో చేరిన మూడు రోజులకు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జస్టిన్​ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆ తండ్రి కంపెనీ వద్ద నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. తన కుమారుడి ఆచూకీ చెప్పాలని రాందాస్​ అధికారులను వేడుకుంటున్నాడు.

    Pashamylaram Incident | హెల్ప్​ డెస్క్ ఏర్పాటు

    పేలుడు ఘటనలో 40 మృతి చెందారు. అయితే పేలుడు దాటికి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. దీంతో డీఎన్​ఏ పరీక్షలు (DNA tests) చేసి కుటుంబ సభ్యులకు (family members) మృతదేహాలు అప్పగించారు. మరోవైపు పలువురి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు పటాన్​చెరు ఆస్పత్రి (Patancheru Hospital) వద్ద హెల్ప్​ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆచూకీ దొరకని వారి వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు రోజులు అవుతున్నా తమవారి జాడ లేక కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. కాగా.. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...