అక్షరటుడే, వెబ్‌డెస్క్: NSDL | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న ఐపీవో(IPO) రాక ఖరారయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీ సంస్థల్లో ఒకటైన ఎన్‌ఎస్‌డీఎల్(NSDL) సబ్‌స్క్రిప్షన్ ఈనెల 30న ప్రారంభం కానుంది. ఈ ఐపీవో వివరాలిలా ఉన్నాయి.
ఆర్థిక(Financial), సెక్యూరిటీల మార్కెట్లలో అనేక ఉత్పత్తులు, సేవలు అందిస్తోన్న ప్రముఖ డిపాజిటరీ(Depositary) సంస్థ అయిన ఎన్‌ఎస్‌డీఎల్.. రూ.4 వేల కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకోసం ఈనెల 29వ తేదీనే బిడ్డింగ్ విండో అందుబాటులో ఉండనుంది. మరుసటి రోజునుంచి క్యూఐబీలు, ఎన్‌ఐఐలు, రిటెయిల్ ఇన్వెస్టర్ల కోసం అవకాశం ఉంటుంది. వచ్చేనెల ఒకటో తేదీ వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంది. కాగా ప్రైస్‌బాండ్ (Price band), లిస్టింగ్ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రమోటర్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC bank), ఐడీబీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంస్థలు పూర్తి ఆఫర్ ఫర్ సేల్(Offer for sale) ద్వారా మొత్తంగా 5.01 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్, ఐడీబీఐ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ, ఎస్‌బీఐ క్యాపిటల్ సంస్థలు బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
NSDL | నికరలాభం..
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(CDSL) 2017లోనే దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో డిపాజిటరీ సర్వీసెస్ సంస్థ అయిన ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీవోకు వస్తోంది. ఇది ఐపీవో కోసం గతేడాది అక్టోబర్‌లోనే సెబీ(SEBI) నుంచి అనుమతులు పొందింది. ఎన్‌ఎస్‌డీఎల్ గత ఆర్థిక సంవత్సరానికిగానూ నికర లాభం(Net profit) రూ. 343 కోట్లుగా నమోదయ్యింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,535 కోట్లుగా ఉంది