అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanaraya Guptha | నగరంలో ఫుట్‌పాత్ లపై ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (District Police Commissioner Sai Chaitanya), నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో శనివారం (Municipal Commissioner Dilip Kumar) నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని వాపోయారు. సిగ్నల్స్, వన్‌వే రోడ్, పార్కింగ్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అలాగే జిల్లాలో డ్రగ్స్ (Drugs), గంజాయి (Marijuana) మహమ్మారి విచ్చలవిడిగా సరఫరా జరుగుతోందని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాంగ్‌వార్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అల్లరిమూకలను ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి(ACP Raja Venkata Reddy), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.