Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | నాలాల ఆక్రమణలు తొలగించాలి : హైడ్రా కమిషనర్​

Hydraa | నాలాల ఆక్రమణలు తొలగించాలి : హైడ్రా కమిషనర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | నాలాల్లో పేరుకుపోయిన చెత్త‌ తొల‌గింపు ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాలని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశించారు. నాలాల్లో ఎక్క‌డా ఆటంకాలు లేకుండా చూడాల‌న్నారు. నాలా ఆక్ర‌మ‌ణ‌లు ఉంటే వెంట‌నే తొల‌గించాల‌న్నారు. చింత‌ల్‌బ‌స్తి(Chintal Basti) మీదుగా సాగే బుల్కాపూర్ నాలా (Bulkapur nala) విస్త‌ర‌ణ ప‌నుల‌ను శుక్ర‌వారం ఆయన ప‌రిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12, పింఛ‌ను ఆఫీసు ద‌గ్గ‌ర 15 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉండాల్సిన నాలా చింత‌ల‌బ‌స్తి వైపు 7 మీట‌ర్ల మేర క‌బ్జాలు జ‌ర‌గ‌గా బుధ‌వారం హైడ్రా వాటిని తొల‌గించిన విష‌యం విధిత‌మే.

ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించినా.. క‌బ్జాలతో క‌ల్వ‌ర్టు కింద స‌గం భాగం పూడుకుపోయింది. ఆ పూడిక తీత‌తో పాటు.. క‌బ్జాల తొల‌గింపు ప‌నులు త్వ‌ర‌గా జ‌ర‌గాల‌ని ఆదేశించారు. జేసీబీల‌ను కాలువ‌లోకి దించి చెత్త‌ను మొత్తం తొల‌గించాల‌ని సూచించారు. వ‌ర‌ద‌కు ఆటంకం లేకుండా.. నాలా ఇత‌ర ప్రాంతాల్లో కూడా క‌బ్జాలుంటే తొల‌గించాల‌ని ఆదేశించారు.