Homeజిల్లాలునిజామాబాద్​Constable murder case | కానిస్టేబుల్​ హత్యకేసు నిందితుడిని ఎన్​కౌంటర్​ చేయాలి

Constable murder case | కానిస్టేబుల్​ హత్యకేసు నిందితుడిని ఎన్​కౌంటర్​ చేయాలి

సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ను నడిరోడ్డుపై హత్యచేసిన రౌడీషీటర్​ రియాజ్​ను ఎన్​కౌంటర్​ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు రియాజ్​ దిష్టిబొమ్మను దహనం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Constable murder case | కానిస్టేబుల్​పై దాడిచేసి హత్య చేసిన రౌడీషీటర్​ రియాజ్​ను (rowdy sheeter Riyaz) కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు కాపాడే పోలీసులనే హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుశాఖలో మంచి పేరున్న సీసీఎస్​ కానిస్టేబుల్ ప్రమోద్​ను (CCS constable Pramod) అతికిరాతకంగా హత్యచేసిన రియాజ్​ను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, కంఠేశ్వర్ జోనల్ ఇన్​ఛార్జి దుర్గాదాస్, గోపి, కార్తీక్, చంద్ర, అఖిలేశ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Constable murder case | తెయూలో రౌడీ షీటర్ దిష్టి బొమ్మ దహనం

అక్షరటుడే, డిచ్​పల్లి: Constable murdered | నగరంలో కానిస్టేబుల్ హత్యకు నిరసనగా తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట రియాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిందితుడిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.