అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా(Baramulla)లో బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బారాముల్లాలోని ఉరి సెక్టార్ వద్ద భారత్(India)లోకి అక్రమంగా చొరబడటానికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులును భద్రతా బలగాలు(Security forces) మట్టుబెట్టాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
కాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్ గామ్(Pahalgam)లో టెర్రరిస్టులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పర్యాటకులపై కాల్పులు జరిపి 27 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మరుసటి రోజు మళ్లీ భారత్‌లోకి చొరబడేందుకు పలువురు ఉగ్రవాదులు యత్నించడం గమనార్హం. ఈ సందర్భంగా భద్రత బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు(Terrorists) మృతి చెందారు.
కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు(Police) అప్రమత్తం అయ్యారు. మరోవైపు పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే అమిత్ షా(Amith Shah) శ్రీనగర్ చేరుకొని ఉగ్రదాడిపై ఆరా తీశారు. మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) సైతం తన సౌదీ పర్యటను అర్ధంతరంగా ముగించుకొని భారత్‌కు వచ్చారు. ఈ ఘటనపై మంత్రివర్గ సమావేశం పెట్టనున్నట్లు సమాచారం.