HomeUncategorizedJharkhand Encounter | జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. మావో క‌మాండ‌ర్ హ‌తం

Jharkhand Encounter | జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. మావో క‌మాండ‌ర్ హ‌తం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Jharkhand Encounter | మావోయిస్టు(Maoists)ల‌కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కమాండర్ మృతి(Maoist commander killed in jharkhand) చెందాడని పోలీసులు మంగళవారం వెల్ల‌డించారు. మరో మావోయిస్టు గాయపడ్డాడని, అతని తలపై రూ.15 లక్షల బహుమతి ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుందని వివరించారు. మహమ్మద్‌‌గంజ్, హైదర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి భద్రతా దళాలకు సమాచారం అందిందన్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు కూంబింగ్(Coombing) చేపట్టాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు.

దీంతో భద్రతా దళాలు(Security forces) వెంటనే అప్రమత్తమై.. ఎదురు కాల్పుల జరిపారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

“పాలములో భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల తర్వాత, సీపీఐ (మావోయిస్ట్) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది” అని డీఐజీ వైఎస్ రమేశ్(DIG YS Ramesh) తెలిపారు. కాల్పుల్లో మరణించిన మావోయిస్టు తులసీ బునియన్‌(Maoist Tulsi Bunyan)గా గుర్తించామని, అతడు టాప్ మావోయిస్టు కమాండర్‌గా పని చేస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉందని వివరించారు. ఇక గాయపడిన మావోయిస్టు నితీశ్ యాదవ్ తలపై రూ.15 లక్షల రివార్డు ఉందన్నారు.

మరోవైపు.. జర్ఖండ్‌లోని లాటెహార్ జిల్లాలో సోమవారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు ఒక‌రు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌(Encounter)లో మనీష్ యాదవ్ మరణించగా, అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు గుర్తు చేశారు. మరోవైపు ఆదివారం రాత్రి దౌనా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్‌ నిర్వహించాయని.. ఆ క్రమంలో మావోయిస్టు కుందన్ కేర్వార్‌‌ను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వైఎస్ రమేశ్ వివరించారు.