HomeUncategorizedEncounter | జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్​ కీలక నేత మృతి

Encounter | జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్​ కీలక నేత మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Encounter | వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులు(Maoists) కుదేలు అవుతున్నారు. నిత్యం ఎన్​కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు.

తాజాగా వారికి మరో షాక్​ తగిలింది. జార్కండ్​లో శనివారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు నక్సల్స్​ మృతి చెందారు. జార్కండ్​లోని ఇచాబార్‌ అడవి(Jharkhand Ichabar forest)లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల్లో జార్ఖండ్ జన్ ముక్తీ పరిషత్ కీలక నేత పప్పు ఉన్నట్లు సమాచారం. పప్పు లోహరాపై రూ.10 లక్షల రివార్డు ఉంది.

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జార్కండ్(Jharkhand)​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బలగాలు నిత్యం కూంబింగ్​(Coombing) చేపడుతూ.. మావోల పని పడుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో పెద్దఎత్తున కూంబింగ్ చేపట్టి పలువురు మావోలను అంతం చేసింది.