అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Mahadev | జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఎన్కౌంటర్(Encounter) చేసుకుంది. కశ్మీర్‌లోని దారా సమీపంలోని హిర్వాన్ – లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) పేరిట సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) మృతి చెందినట్లు సమాచారం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 26 మంది అమాయాకులను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా దాడులకు పాల్పడిన పాక్‌కు కూడా బుద్ధి చెప్పింది. అయితే పహల్గామ్లో (Pahalgam) దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ మాత్రం ఇంత వరకు దొరకలేదు. తాజాగా ఎన్కౌంటర్ మృతి చెందిన వారు పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తెలుస్తోంది.
Operation Mahadev | భారీగా బలగాల మోహరింపు
పహల్గామ్ దాడికి పాల్పడిన నిందితులు దారా సమీపంలో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భారీగా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అనంతరం జరిగిన ఎన్కౌంటర్లో పహల్గామ్ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. చనిపోయిన వారు పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు
చెందినవారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Session) ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుండగా.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడం గమనార్హం. ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా చనిపోయినట్లు తెలుస్తోంది.