అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Encounter | ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు షూటర్లకు గాయాలు కాగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దిరు ఇటీవల ఆయా నగర్ (Aya Nagar)లో జరిగిన భారీ కాల్పుల ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా.. ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో ఇద్దరు నేరస్థులు కాళ్లకు తూటాలు తగలడంలో గాయపడ్డారు. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.
Delhi Encounter | ఆయా నగర్ కాల్పుల ఘటనలో..
“ద్వారకా ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ బృందం, నేరస్థుల మధ్య చిన్న ఎన్‌కౌంటర్ జరిగిందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Delhi Crime Branch Police) తెలిపారు. ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నామని.. వీరిద్దరూ కాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఆయా నగర్ కాల్పుల ఘటనలో పాల్గొన్న ఈ ఇద్దరినీ అరెస్టు చేశామని” తెలిపారు.
Delhi Encounter | గురుగ్రామ్‌లోనూ..
కాగా.. ఆదివారం గురుగ్రామ్ (Gurugram)లోనూ మరో ఎన్‌కౌంటర్ జరిగింది. సోహ్నా-గురుగ్రామ్ రోడ్డుపై క్రైమ్ బ్రాంచ్ సెక్టార్-40 మరియు మేవాత్ పున్హానా యూనిట్ల పోలీసులు ఒక అంతర్రాష్ట్ర నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు.
Delhi | A brief encounter took place between the Delhi Police crime branch and criminals in the Dwarka area. Two were arrested. Both sustained gunshot wounds to their legs. Both were involved in the Aya Nagar shooting incident, where 69 bullets were fired, and have been arrested:…
— ANI (@ANI) January 6, 2026