HomeUncategorizedEncounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్టుల మృతి

Encounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్టుల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్​గఢ్​(Chhattisgarh)లో జరిగిన ఎన్​కౌంటర్​ ఇద్దరు మావోలు మృతి చెందారు. కాంకేర్‌ జిల్లా(Kanker District)లో చోటే భేథియాలో శుక్రవారం ఉదయం ఈ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఆపరేషన్ కగార్(Operation Kagar)​లో భాగంగా బలగాలు ఛత్తీస్​గఢ్​లోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్​కౌంటర్లు చోటు చేసుకుంటుండడంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు.

Encounter | స్వగ్రామానికి గాజర్ల రవి మృతదేహం

ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​(Encounter)లో ముగ్గురు మృతి చెందారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత, ఏవోబీ స్పెషల్​ జోనల్​ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్​ ఉదయ్​ అలియాస్​ గణేశ్​ కూడా మృతి చెందాడు. ఆయన స్వగ్రామం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా(Bhupalapally District) టేకుమల్ల మండలం వెలిశా. దీంతో రవి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. శుక్రవారం వెలిశాల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Encounter | భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రాంతాలు

ఆపరేషన్​ కగార్​ ఆపాలని మావోయిస్టులు(Maoists) శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్​కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్​ ఇటీవల లేఖ విడుదల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. ములుగు జిల్లాలో సాయుధ బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఏపీలోని ఒడిశా సరిహద్దులో సైతం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.