అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Encounter | కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన విషయం తెలిపిందే.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా వేలాది సంఖ్యలో భద్రతా బలగాలు (Security Forces) అడవులను జల్లెడ పడుతున్నాయి. నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోకి సైతం బలగాలు చొచ్చుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వరుస ఎన్కౌంటర్లు చేసుకుంటుండగా.. చాలా మంది మావోయిస్టులు మృతి చెందారు.
Encounter | నారాయణపూర్ సరిహద్దులో..
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నారాయణ్‌పూర్, దంతెవాడ నుంచి జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), రాష్ట్ర పోలీసు దళంలోని రెండు విభాగాలైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం అంతర్ జిల్లా సరిహద్దులో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమలో బయలుదేరినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీస్ అధికారులు తెలిపారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్తలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటన స్థలంలో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది.