HomeUncategorizedEncounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. మావోయిస్ట్​ కీలక నేత హతం

Encounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. మావోయిస్ట్​ కీలక నేత హతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీజాపూర్​ జిల్లాలో (Bijapur district) నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సోమవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు నేత సోది కన్నా (Maoist leader Sodi Kanna) మృతి చెందాడు. 303 రైఫిల్, భారీగా మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Encounter | మావోయిస్టుల స్నైపర్​

సోది కన్నా నక్సలైట్ స్నిపర్‌గా బలగాలు పేర్కొన్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ నంబర్ 01లోని కంపెనీ నంబర్ 02 డిప్యూటీ కమాండర్ అయిన ఆయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. సీనియర్​ నాయకుడు మద్వి హిడ్మాకు సన్నిహితుడైన ఆయన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించాడు.

ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్​జీ బీజాపూర్, డీఆర్​జీ దంతెవాడ, STF, కోబ్రా, సీఆర్​పీఎఫ్​ బలగాలు (Cobra and CRPF forces) సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్​లో కీలక నేత సోది కన్నా మృతి చెందడం గమనార్హం.

Encounter | వరుస ఎన్​కౌంటర్లు

ఆపరేషన్​ కగార్​లో భాగంగా మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్​కౌంటర్లు చోటు చేసుకుంటుండగా.. భారీగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. రెండు రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

Encounter | కీలక నేతలు హతం

ఆపరేషన్​ కగార్​లో (Operation Kagar) భాగంగా ఇటీవల జరుగుతున్న ఎన్​కౌంటర్లలో కీలక నేతలు హతం అవుతుండటం మావోయిస్టులను కలవర పెడుతోంది. గత నెలలో జరిగిన ఎన్​కౌంటర్లలో నంబాల కేశవరావు, సుధాకర్​, భాస్కర్​ లాంటి కీలక నేతలు ఇటీవల మరణించారు. మరోవైపు భారీగా కేడర్​ను కోల్పోతుండటంతో నక్సల్స్​ ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఎన్​కౌంటర్లు జరుగుతుండటంతో పలువురు ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. కొత్తగా రిక్రూట్​మెంట్లు లేక మావోయిస్టులు రోజురోజుకు బలహీనం అవుతున్నారు.

Must Read
Related News