HomeUncategorizedChhattisgarh Encounter | ఛత్తీస్‌గ‌డ్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌.. సీఆర్‌పీఎఫ్ క‌మాండో, న‌క్స‌లైట్ మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్‌గ‌డ్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌.. సీఆర్‌పీఎఫ్ క‌మాండో, న‌క్స‌లైట్ మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chhattisgarh encounter | దండ‌కార‌ణ్యంలో తుపాకులు గ‌ర్జిస్తూనే ఉన్నాయి. గురువారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌(encounter)లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా క‌మాండోతో పాటు ఓ న‌క్స‌లైట్ మృతి చెందాడు.

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో గురువారం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో కోబ్రా కమాండో(Cobra Commando), ఒక నక్సలైట్ మరణించారని అధికారులు తెలిపారు. తుమ్రేల్ గ్రామ ప్రాంతంలో జ‌రుగుతున్న ఈ ఆపరేషన్‌కు CRPFకి చెందిన కోబ్రా యూనిట్ 210వ బెటాలియన్ నాయకత్వం వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల(Chhattisgarh Police) డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్(Special Task Force) బ‌ల‌గాలు అడ‌వుల‌ను జల్లెడ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్‌కౌంట‌ర్(encounter) చోటు చేసుకుంది. కోబ్రా క‌మాండో (Cobra Commando) ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. గాయపడిన క‌మాండోను భారత వైమానిక దళ(Indian Air Force) హెలికాప్టర్‌లో త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు.

కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(CoBRA) అనేది CRPF ప్రత్యేక అడవి యుద్ధ విభాగం. వామపక్ష తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోల ముప్పును తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా భద్రతా దళాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలో నిరంతర ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి.

నక్సలైట్ కార్యకలాపాలకు కంచుకోట‌గా భావించే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం(Bastar region)లోకి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చొచ్చుకెళ్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం మావోల‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్ పోలీసుల(Chhattisgarh Police) జిల్లా రిజర్వ్ గార్డ్​తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది నక్సలైట్లు మరణించారు. మృతుల్లో మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, ఆ గ్రూపులోని అగ్ర కమాండర్లలో ఒకరైన 70 ఏళ్ల బసవరాజు అలియాస్ నంబల కేశవ్ రావు కూడా ఉన్నారు. మావోయిస్టు చ‌రిత్ర‌లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్థాయి వ్య‌క్తి ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెంద‌డం ఇదే తొలిసారి.