35
అక్షరటుడే, ఆర్మూర్: Telanagana EMRS | ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (Eklavya Model Residential Schools) (ఈఎంఆర్ఎస్) 7,267 పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వెలువడింది. కాగా ఈనెల 13,14 తేదీలలో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా ఆదివారం నాన్ టీచింగ్ (non-teaching) ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు.
Telanagana EMRS | హైదరాబాద్లో పరీక్షలు..
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు హాస్టల్ వార్డెన్, ఫిమేల్ నర్స్ స్టాప్ పోస్టులకు పరీక్షలు జరగగా.. మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని పలు పరీక్ష కేంద్రాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.