అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | పర్యాటక రంగంతో కశ్మీర్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం చీనాబ్ రైల్వే వంతెన(Chenab Railway Bridge) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారి కశ్మీర్లో పర్యటించిన మోదీ పాకిస్తాన్(Pakistan)పై విమర్శలు చేశారు. పాకిస్తాన్ మానవత్వం మరిచి.. పర్యాటకులపై దాడి చేయించిందన్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని పాకిస్తాన్ కుట్ర చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో మనం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే.. పాకిస్తాన్ సామాన్యుల ఇళ్లు, ప్రార్థన స్థలాలను టార్గెట్ చేసిందన్నారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు ఆపలేరని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు.
PM Modi | ఆయనను గుర్తు చేసుకున్న మోదీ
పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులతో పాటు స్థానికంగా గుర్రం తోలే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. మోదీ తన ప్రసంగంలో ఆయనను గుర్తు చేశారు. గుర్రం మీద పర్యాటకులను తీసుకు వెళ్లే ఆదిల్ హుస్సేన్ ఆ రోజు ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడని మోదీ అన్నారు. అతడినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రకుట్రలకు దీటుగా బదులిస్తామని ప్రధాని(Prime Minister) పేర్కొన్నారు.
PM Modi | మన శక్తి ఏంటో చూపించాం..
కశ్మీర్(Kashmir)లో పర్యాటక రంగాన్ని ధ్వంసం చేయడానికి పాక్ పహల్గామ్ దాడికి పాల్పడిందని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ ద్వారా జవాబు ఇచ్చామని, దాయాదీ దేశానికి మన శక్తి ఏమిటో చూపించామని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల కల అయిన చీనాబ్ రైల్వే వంతెనతో కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.