HomeతెలంగాణMunicipal Corporation | మున్సిపల్​ కార్పొరేషన్​లో సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

Municipal Corporation | మున్సిపల్​ కార్పొరేషన్​లో సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: నగరంలోని మున్సిపాలిటీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది తమకు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. దీంతో వారికోసం మున్సిపల్​ కార్పొరేషన్​కు (Municipal Corporation) వచ్చే దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

Municipal Corporation | ప్రభుత్వ పథకాలు అందని వారి కోసం..

ఏదైనా అనివార్య కారణాలతో ప్రభుత్వ పథకాలు (government schemes) అందని వారి కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే గురువారం కేంద్రంలో ఒకే ఒక్కరు విధులు నిర్వహించడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పలేదు. సిబ్బందిలో కొందరు సెలవులో ఉండగా వారి స్థానంలో ఇతరులకు విధులు కేటాయించారు. కానీ వారు గైర్హాజరవడంతో ఒకే ఉద్యోగిని దరఖాస్తులను స్వీకరించారు. దీంతో దరఖాస్తుదారులు గంటలతరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

Must Read
Related News