అక్షరటుడే, ఇందూరు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్తో (TNGOs) కలిసి రావాలని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు స్వామి, సునీత ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఉద్యోగుల (Irrigation Department employees) ఐక్యత అభినందనీయమన్నారు. భవిష్యత్తులో టీఎన్జీవోస్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తోడుగా నిలవాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం కమిటీ రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణరావు, రాష్ట్ర కన్వీనర్ నజీర్ అహ్మద్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
TNGOs Nizamabad | నీటిపారుదల శాఖ నూతన కార్యవర్గం
జిల్లా అధ్యక్షుడిగా జనార్ధన్, జిల్లా కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ, కోశాధికారిగా ఇక్బాల్, సహాధ్యక్షులుగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వెంకటరామిరెడ్డి, జగన్మోహన్, వసంత, సంయుక్త కార్యదర్శిగా సంపత్, మల్లయ్య, సమంత, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జయరాజ్, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా అజీమ్, ఆశన్న, చిన్న గంగారాం, చిన్న శివరాజ్ తదితరులు ఎన్నికయ్యారు.