More
    HomeతెలంగాణBlood Donation Camp | ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయం

    Blood Donation Camp | ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Blood Donation Camp | ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (Revenue Employees Services Association) జిల్లా శాఖ, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ (Helping Hearts Foundation) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తలసేమియా (Thalassemia) రోగుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. 60 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం మంచి పరిణామం అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు.

    అనంతరం రక్తదానం చేసిన ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్​ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ప్రభు, విజయ్​కాంత్​రావు, మహేష్, శ్రీనివాస్, రెడ్​క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

    More like this

    KTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో...

    Pakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్కాట్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్(Asia...

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ...