అక్షరటుడే, వెబ్‌డెస్క్:Pension | ప్రజలకు పెన్షన్ పంచమని ఇచ్చిన డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) ఆడాడో ఉద్యోగి. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
సత్యసాయి జిల్లా గుణేమోరుబాగల్ గ్రామం(Gunemorubagal village)లో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు పంపిణీ చేయడానికి ఇచ్చిన రూ.1.70 లక్షలను సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున (Secretariat Welfare Assistant Mallikarjuna) డబ్బులు పంపిణీ చేయలేదు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
దీంతో తమకు పెన్షన్ డబ్బుకు రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందారు. తీరా సదరు ఉద్యోగిని నిలదీయగా.. ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి స్వాహా చేసినట్లు బయట పడింది. దీంతో పంచాయతీ కార్యదర్శి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు(Police) విచారణ చేస్తున్నారు. ఇదేమైనా వృద్ధులు, మహిళలు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. కొందరు వాటితోనే నెలంతా నెట్టుకొస్తారు. ఇలా డబ్బులు కాజేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.